డెంగీతో విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-06-03T00:55:13+05:30 IST
మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో డెంగీ జ్వరంతో శుక్రవారం ఓ బాలు డు మృతి చెందాడు.

బొమ్మనహాళ్, జూన 2: మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో డెంగీ జ్వరంతో శుక్రవారం ఓ బాలు డు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఈరమ్మ, ధనుంజయ దంపతుల కుమారుడు వన్నూరుస్వామి(13) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేవాడు. వేసవి సెలవులు కావడంతో కర్ణాటకలోని బళ్లారి జిల్లా కొళగళ్లు గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లి నాలుగురోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వచ్చిన తరువాత తీవ్రమైన జ్వరం రావడంతో కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో రెండు రోజుల కిందట బళ్లారి విమ్స్‌కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్ధారించారని కుటుంబసభ్యులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.