దౌర్జన్యపరుల చేతిలో రాష్ట్రం: గుండుమల

ABN , First Publish Date - 2023-09-25T23:54:51+05:30 IST

దౌర్జన్యపరుల చేతిలో ఆంధ్రప్రదేశ చిక్కు కుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి విమర్శిం చారు.

దౌర్జన్యపరుల చేతిలో రాష్ట్రం: గుండుమల

అగళి, సెప్టెంబరు 25: దౌర్జన్యపరుల చేతిలో ఆంధ్రప్రదేశ చిక్కు కుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి విమర్శిం చారు. ఇందుకు నిదర్శనం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్‌చేసి జైల్లో పెట్టించడమే అని, ఈ విషయం ప్రజలందరికీ అర్థమైంద న్నారు. చంద్రబాబు అరెస్టును నిరసి స్తూ గుండుమల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సోమవారం మండలం లోని ముత్తెపల్లి నుంచి అగళి వరకు సంఘీభావ పాదయాత్రను నిర్వ హించారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ... రాష్ట్రంలో సైకో పాలన పోవాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలు, కార్ప ణ్యాలతోనే పాలన సాగుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజ లు ఎదురుచూస్తున్నారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చే వరకు ఈ నిరాహార దీక్షలు, పాదయాత్రలు కొనసాగు తాయన్నారు. ఏది ఏమైనా రాష్ట్రం లో రాక్షస పాలన కొనసాగు తోం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎం పాళ్యం వద్ద దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత రం అగళిలో ఎన్టీరామారావు విగ్ర హానికి పూలమాలలువేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పార్థసారథిరెడ్డి, జడ్పీటీసీ ఉమేష్‌, ఎస్సీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జయకుమార్‌, బీసీసెల్‌ అఽధ్యక్షుడు తిప్పేస్వామి, నాయకులు డాక్టర్‌ కృష్ణమూర్తి, మండల క్లస్టర్‌ ఇనచార్జ్‌ శివకుమార్‌, రిటైర్డ్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీర్‌ మల్లికార్జున, మండలంలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:54:51+05:30 IST