Share News

గుంతకల్లు మీదుగా దీపావళికి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-11-10T23:58:16+05:30 IST

దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుంతకల్లు మీదుగా సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గుంతకల్లు మీదుగా దీపావళికి ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు, నవంబరు10: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుంతకల్లు మీదుగా సింగిల్‌ ట్రిప్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హుబ్లీ-బీదర్‌ (నెం. 06505) ప్రత్యేక రైలు ఈనెల 10వతేదీ మధ్యాహ్నం రెండున్నరకు హుబ్లీలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12-15 గంటలకు బీదర్‌కు వెళ్తుందన్నారు. బీదర్‌-యశ్వంతపూర్‌ (నెం. 06506) ప్రత్యేక రైలు 11వ తేదీ మధ్యాహ్నం రెండున్నరకు బీదర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుతుందన్నారు. యశ్వంతపూర్‌ బీదర్‌ (నెం. 06507) ప్రత్యేక రైలు 13వ తేదీ అర్ధరాత్రి 11-15 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12-15 గంటలకు బీదర్‌కు చేరుతుందన్నారు. బీదర్‌ యశ్వంతపూర్‌ (నెం. 06508) ప్రత్యేక రైలు బీదర్‌లో 14వ తేదీన మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుందని తెలియజేశారు. ఈ రైళ్లు హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాద్గిర్‌, వాడి, షాషాబాద్‌, కలబురిగి, హోమ్నాబాద్‌ స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు. అలాగే బెంగళూరు-హజ్రత నిజామొద్దీన (ఢిల్లీ) ప్రత్యేక రైలు ఈనెల 10న బెంగళూరులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం ఎనిమిదిన్నరకు ఢిల్లీకి చేరుతుందన్నారు. ఈ రైలు యల్హంక, గౌరీబిదనూరు, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాద్గిర్‌, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, బాలార్షా, నాగపూర్‌, ఇటార్సి, భోపాల్‌, ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రా కంటోన్మెంటు స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

Updated Date - 2023-11-10T23:58:18+05:30 IST