అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు

ABN , First Publish Date - 2023-03-02T23:30:02+05:30 IST

ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు

అనంతపురం కల్చరల్‌, మార్చి 2: ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుమంత గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రీజియనలో అనంతపురం, గుంతకల్లు, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి డిపోల నుండి బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 6న సాయంత్రం ఆయా డిపోల నుంచి బస్సులు బయలుదేరి, 7వ తేదీన మంగళవారం అరుణాచలం చేరుకుంటాయన్నారు. అదేరోజున సాయంత్రం అరుణాచలం నుండి తిరిగి బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున డిపోలకు చేరుకుంటాయన్నారు. కాగా అరుణాచలం వెళ్లే యాత్రికులకు డిపోల వారీగా టికెట్‌ ధరలు నిర్దేశించినట్లు తెలిపారు. అనంతపురం డిపో నుంచి రూ.1450, గుంతకల్లు డిపో నుంచి 1860లు, తాడిపత్రి రూ.1345లు, ఉరవకొండ రూ.1570లు, రాయదుర్గం రూ.1860లుగా టికెట్‌ ధరలు ఉంటాయన్నారు. ప్రయాణికులు ఆయా బస్టాండ్ల రిజర్వేషన కౌంటర్లతో పాటు వెబ్‌సైట్‌ ద్వారానూ టికెట్లను ముందస్తుగా రిజర్వేషన చేసుకోవచ్చునన్నారు. వివరాలకోసం అనంతపురం (9959225853), గుంతకల్లు(9959225855), రాయదుర్గం (9959225863), ఉరవకొండ (9959225861), తాడిపత్రి(9959225856) నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.

బెంగళూరు, నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

గుంతకల్లు, మార్చి 2: ప్రయాణికుల రద్దీ నియంత్రణకు బెంగ ళూరు-నర్సాపూర్‌ (వయా అనంతపురం-గుత్తి-డోన) మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరు-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (06521) మార్చి 3వ తేదీన బెంగళూరులో ఉదయం 11-20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం ఆరున్నరకు నర్సాపూర్‌కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06522) ఈనెల 4వ తేదీన నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3-40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బెంగళూరుకు చేరుతుందన్నారు. అలాగే బెంగళూరు-నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (06549) 5వ తేదీన, తిరుగు ప్రయాణపు రైలు 6వ తేదీన ఇదే వేళల్లో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైళ్లు యల్హంక, హిందూ పురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన, నంద్యాల, గిద్దలూరు, కంబం, మార్కాపురం రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం రోడ్డు, పాలకొల్లు స్టేషన్ల మీదుగా వెళ్తాయని తెలిపారు.

బెంగళూరు-కాచిగూడ మధ్య..

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం బెంగళూరు-కాచిగూడ-బెంగళూరు మధ్య ఓ ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-కాచిగూడ (నెం. 06523) ప్రత్యేక రైలును ఈ నెల 3, 5 తేదీల్లో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు బెంగళూరులో పేర్కొన్న తేదీల్లో మధ్యాహ్నం మూడున్నరకు బయలుదేరి, కాచిగూడకు మరుసటిరోజు ఉదయం 5-20 గంటలకు చేరుకుంటుందని తెలియజేశారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 06524) కాచిగూడలో 4, 6 తేదీల్లో ్ధరాత్రి 10-55 గంటలకు బయలేదేరి, మరుసటిరోజు ఉదయం 11-45 గంటలకు చేరుకుంటుందని వివరించారు. ఈ రైలు యల్హంక, హిం దూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, గద్వాల, వనపర్తి రోడ్డు, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, ఉందా నగర్‌ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందన్నారు.

Updated Date - 2023-03-02T23:30:02+05:30 IST