భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ: ఆర్‌ఎస్‌ఎస్‌

ABN , First Publish Date - 2023-06-02T23:30:11+05:30 IST

భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ అని పలువురు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పామిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ పట్టాభిషేక మహోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు.

భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ: ఆర్‌ఎస్‌ఎస్‌

పామిడి, జూన 2: భారతజాతి స్ఫూర్తి ప్రదాత శివాజీ అని పలువురు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పామిడి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శివాజీ పట్టాభిషేక మహోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సరస్వతీ విద్యామందిరం నుంచి శివాజీ విగ్రహం వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శివాజీ పట్టాభిషేక మహోత్సవంను ఇప్పటికీ హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. శివాజీ భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. శివాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నినదించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు నాయక్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు పట్రాశ్రీనివాసులు, బీవీ రత్నమయ్య, జోజోడే కుమార్‌, చౌడయ్య, సుధాకర్‌శెట్టి, మంజునాథరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:30:11+05:30 IST