నడిరోడ్డులో మురుగునీటి ప్రవాహం
ABN , First Publish Date - 2023-06-26T01:04:01+05:30 IST
మండలంలోని బుళ్ళసముద్రం పంచాయతీ కేంద్రంలో తాగునీటి పైపులైనలో నీరు లీకేజీ అవుతోంది.
మడకశిర రూరల్, జూన 25: మండలంలోని బుళ్ళసముద్రం పంచాయతీ కేంద్రంలో తాగునీటి పైపులైనలో నీరు లీకేజీ అవుతోంది. దాదాపు సంవత్సరం ఆ నీరు నిత్యం ప్రవహిస్తుండడంతో ప్రధాన రహదారిలో మురు గు ఏర్పడింది. ఆ మురుగునీటిలో వెళ్లడానికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. అయినా అధికారలెవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు వా పోతున్నారు. మురుగు నీరు నడిరోడ్డులో ప్రవహిస్తుడంవల్ల దోమలు వ్యా ప్తి చెంది స్థానికులు జ్వరాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మురుగు నీరు అంగనవాడీ కేంద్రం ఎదుట ప్రవహిస్తుండడంతో కొంత మంది చిన్నారులకు జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. స్థానికంగా ఉన్న సచివాలయంలో అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.