విచ్చల విడిగా వాహనాల పార్కింగ్‌

ABN , First Publish Date - 2023-09-04T23:49:29+05:30 IST

అసలే పట్టణంలో రోడ్లు ఇరుకైనవి. దీనికి తోడు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఎదురెదురుగా రెండు పెద్ద వాహనాలు వస్తే ట్రా ఫిక్‌ జామ్‌ కావాల్సిందే.

విచ్చల విడిగా వాహనాల పార్కింగ్‌

హిందూపురం అర్బన, సెప్టెంబరు 4: అసలే పట్టణంలో రోడ్లు ఇరుకైనవి. దీనికి తోడు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఎదురెదురుగా రెండు పెద్ద వాహనాలు వస్తే ట్రా ఫిక్‌ జామ్‌ కావాల్సిందే. ఈ పరిస్థితి హిందూపురం అన్ని రోడ్లలోనూ తారసపడుతుంది. రాష్ట్ర మంతా రోడ్లు వెడల్పు చేసి పట్టణాలను ఆధు నీకరిస్తున్నారు. కానీ హిందూపురంలో మాత్రం ఇరుకైన రోడ్లే ఉన్నా యి. ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్‌ చేయడంతో పాటు కొన్ని చోట్ల తోపుడుబండ్లను కూడా రోడ్డుపైనే ఉంచుతున్నారు. దీంతో వాహ నదారులు, పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటీవల గ్యాస్‌ పైప్‌ లైన కోసం పురంలో ఎక్కడ పడితే అక్కడ తవ్వే స్తున్నారు. బైపాస్‌ రోడ్డులో మునిసిపల్‌ కార్యాలయం ఎదుటి నుంచి రహమతపురం సర్కిల్‌ వరకు పైప్‌లైన ఏర్పాటుకు రోడ్డుకు ఒక వైపు తవ్వేశారు. దీంతో ఒక వైపు రోడ్డు బంద్‌ అయిపో యింది. ఇక ఉన్న రోడ్డులోనే ఎదురెదురు వాహనాలు రాకపోకలు సా గించాల్సి వస్తోంది. సాయంత్రం సమయంలో సమీపంలోని పాఠశాల వదలడం, కార్యాలయాల నుంచి వచ్చేవారితో చాలా బిజీగా మారిపోతుంది. దీంతో బస్సులు, ఆటోలు అటుగా సజావుగా వెళ్లడానికి వీలు లేకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రెండు రోజులుగా పట్టణంలో చిరు జల్లులు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పురంలో ఇంత జరుగుతున్నా ట్రాఫిక్‌ పోలీసులు స్పందిం చడంలేదు. పట్టణంలో ఎక్కడ చూసినా వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉంటున్నా చూసీ చూడనట్టు వెళ్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ట్రాఫిక్‌ నియంత్రించడంలో పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది విఫలమైనారని మండిపడుతున్నారు. అలాగే ఉదయం నుంచి పదిగంటల వరకు ఆకుకూరల వాహనాలు ఉంచి వ్యాపారం చేసేవారు చెత్తా చెదారం అక్కడే పడేసి వెళుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య, రోడ్లపై పారిశుధ్య సమస్య తలెత్తుతోందని ప్రజలంటున్నారు. మున్సి పల్‌ అధికారులు, పోలీసులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2023-09-04T23:49:29+05:30 IST