సీమ డాన
ABN , First Publish Date - 2023-06-26T00:19:50+05:30 IST
రాయలసీమ వ్యాప్తంగా విస్తరించిన మట్కాకు కేంద్ర బిందువు తాడిపత్రి. ఇక్కడ ఉన్న మట్కాడాన మొత్తం కథ నడిపిస్తుంటారు. అయినా పోలీసులు డానను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాడిపత్రి కేంద్రంగా ఆనలైన ద్వారా భారీఎత్తున మట్కాను డాన నిర్వహిస్తున్నాడు.
తాడిపత్రి కేంద్రంగా మట్కా
అధికార పార్టీవారి సన్నిహితుడు
అందుకే పోలీసులు పట్టించుకోలేదా..?
మట్కా విస్తరణలో సిబ్బంది పాత్ర..?
బీటర్లను రిక్రూట్ చేసి.. మామూళ్లు..?
రాయలసీమ వ్యాప్తంగా విస్తరించిన మట్కాకు కేంద్ర బిందువు తాడిపత్రి. ఇక్కడ ఉన్న మట్కాడాన మొత్తం కథ నడిపిస్తుంటారు. అయినా పోలీసులు డానను అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాడిపత్రి కేంద్రంగా ఆనలైన ద్వారా భారీఎత్తున మట్కాను డాన నిర్వహిస్తున్నాడు. తాడిపత్రిలో పోలీసులు దాడులు ఎక్కువైనపుడు జిల్లా కేంద్రానికి మకాం మారుస్తాడు. అక్కడ పోలీసుల కన్ను పడితే తాడిపత్రిలో కార్యకలాపాలు కొనసాగిస్తాడు. ఒకప్పుడు బీటర్‌గా ఉన్న వ్యక్తి నేడు మట్కా డానగా మారడానికి అధికారపార్టీకి చెందిన కొందరు నాయకుల మద్దతే కారణమని సమాచారం. అధికారపార్టీ వారితో తనకున్న సన్నిహిత సంబంధాలను అవకాశంగా చేసుకుని.. మట్కాను అంతకంతకు విస్తరిస్తూ.. చివరకు పోలీసులకు సవాలుగా మారాడు. అధికారపార్టీ అండ ఉండటంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పోలీసు శాఖలోని కొందరితో మట్కాడాన ఆర్థిక సంబంధాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. డాన కోసం పనిచేసుఉ్తన్న బీటర్ల జోలికి సైతం పోలీసులు వెళ్లడం లేదు. కొన్నిరోజుల క్రితం పోలీసులు జరిపిన దాడుల్లో అనేకమంది మట్కా నిర్వాహకులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.10లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తమకు అనుకూలంగా లేనివారినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం ఉంది.
- తాడిపత్రి
కొత్త డీఎస్పీ రాకతో..
డీఎస్పీ చైతన్య హయాంలో ఈ స్థాయిలో మట్కా దాడులు జరిగిన సందర్భాలు లేవు. అప్పట్లో పోలీసులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. పోలీసు అధికారుల ఉదాసీన వైఖరి కూడా మట్కా పెరగడానికి కారణమైంది. కిందిస్థాయి సిబ్బంది సైతం మట్కాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకున్నారన్న ప్రచారం ఉంది. గతంలో ఎస్‌ఐ స్థాయిలో పనిచేసిన అనుభవం ఉండడంతో డీఎస్పీ గంగయ్య మట్కాపై ఆరాతీయడం ప్రారంభించారు. దీంతో ఎక్కడ తమ గుట్టు రట్టు అవుతుందోనని మట్కా కేంద్రాలపై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారని ప్రచారం ఉంది. ఈ దాడుల్లో సైతం పూర్తిస్థాయిలో మట్కా నిర్వాహకులను, బీటర్లను అరెస్టు చేయలేదు. తమకు సన్నిహిత సంబంధాలు ఉన్న వారిని కాకుండా, మిగిలిన వారిని అరెస్టు చేసి కేసులు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఈ దాడులు జరిగి రెండు వారాలు దాటింది. ఆ తరువాత మట్కా బీటర్లను అరెస్టు చేసిన సందర్భాలు లేవు. అప్పుడప్పుడు సెబ్ పోలీసులు మాత్రం మట్కా బీటర్లను అరెస్టు చేసి, కేసు నిమిత్తం పట్టణ పోలీసులకు అప్పగిస్తున్నారు.
వారే ప్రోత్సహిస్తున్నారా..?
తాడిపత్రి పట్టణ పోలీ్‌సస్టేషనలో పనిచేసే సిబ్బందిలో కొందరు మట్కాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరు ప్రతినెలా ఒక్కొక్క బీటర్ నుంచి రూ.1700 వసూలు చేస్తున్నారని సమాచారం. మామూళ్లకు అలవాటుపడ్డ సిబ్బంది, నెలవారీ మామూళ్లు ఇస్తున్న బీటర్లు ఉండేప్రాంతంలో కొత్త బీటర్లను ఏర్పాటు చేస్తున్నారని, వారి నుంచి కూడా మామూళ్లు గుంజుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా పట్టణంలో మట్కాబీటర్ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. తాము ఇచ్చే నెలవారీ మామూళ్లు సరిపోవని, మరికొందరిని తెచ్చి తమ వ్యాపారాన్ని పోలీసులు దెబ్బకొడుతున్నారని బీటర్లు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. పట్టణ పోలీ్‌సస్టేషనలో పనిచేసే కొందరు సిబ్బంది మట్కావంటి అసాంఘిక కార్యకలాపాల ద్వారా వచ్చే డబ్బుల కోసం అన్వేషిస్తుంటారని ప్రచారం ఉంది.
వదిలేసిన అధికారులు
మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న కిందిస్థాయి సిబ్బందిపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారిపై నియంత్రణ లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి వారిపై డీఎస్పీ చైతన్య చర్యలు తీసుకొని వీఆర్ కూడా పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. పోలీసు అధికారుల ఉదాసీన వైఖరి కూడా కిందిస్థాయి సిబ్బంది అక్రమాలకు కారణమని విమర్శలు వస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు సిబ్బందిలో కొందరు మోటార్‌సైకిళ్ల మీద తిరుగుతూ మామూళ్లను వసూలు చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి వారివల్ల నిజాయితీగా పనిచేసే వారుసైతం మాట పడుతున్నారు.