మీసేవలు అమోఘం
ABN , First Publish Date - 2023-12-10T23:33:13+05:30 IST
సత్యసాయి బాబా సేవాస్ఫూర్తితో అందిస్తున్న వైద్యసేవలు అమోఘమంటూ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ అభినందించారు. శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవాన్ని స్థానిక సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు.
శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి వార్షికోత్సవంలో
సిబ్బందిపై ఆర్‌జే రత్నాకర్ ప్రశంసలు
పుట్టపర్తి, డిసెంబరు 10: సత్యసాయి బాబా సేవాస్ఫూర్తితో అందిస్తున్న వైద్యసేవలు అమోఘమంటూ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ అభినందించారు. శ్రీసత్యసాయి మొబైల్ ఆసుపత్రి 18వ వార్షికోత్సవాన్ని స్థానిక సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌జే రత్నాకర్ మాట్లాడుతూ.. సత్యసాయి 18 సంవత్సరాల క్రితం గ్రామీణ పేదప్రజల ముందుకే ఉచిత వైద్య సేవలు అందించడానికి మొబైల్ ఆసుప్రతిని ప్రారంభించారన్నారు. నాటి నుంచి నిరంతరాయంగా లక్షలమందికి ఉచిత వైద్యసేవలతోపాటు అవసరమైన మందులు, శస్త్ర చికిత్సలు అందించారన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు, వలంటీర్లు ప్రతినెలా 1 నుంచి 12వ తేదీ వరకు ఆరు మండలాల పరిధిలోని 12 గ్రామాల్లో వైద్యసేవలు అందించడం గొప్ప విషయమన్నారు. సత్యసాయి భౌతికంగా లేకపోయినా, అందరి వెంట ఉండి సేవా కార్యక్రమాలు కొనసాగేలా చేస్తున్నారన్నారు. సత్యసాయి బాబా పేర్కొన్నట్లు మాఽనవ సేవే మాధవసేవ అని, వలంటీర్లు.. గ్రామీణులకు అందిస్తున్న సేవలు ఎంతో ఊరటనిస్తున్నాయన్నారు. అనంతరం మొబైల్ ఆసుపత్రి డైరెక్టర్ నరసింహనతోపాటు, పలువురు వైద్యులను, వలంటీర్లను ఆయన ఘనంగా సన్మానించి,