చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2023-06-03T00:24:32+05:30 IST

మండలంలోని బిసలమానేపల్లి పంచాయతీ వెంకటాపురానికి గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు సరిగా లేకపోవ డంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చందాలు వేసుకుని రోడ్డు నిర్మాణం

లేపాక్షి, జూన 2: మండలంలోని బిసలమానేపల్లి పంచాయతీ వెంకటాపురానికి గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు సరిగా లేకపోవ డంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమ య్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి కనీసం ఆంబులెన్స వచ్చే మార్గం కూడా లేదన్నారు. ఈ తరుణంలో గ్రామ స్థులు చందాలు వసూలు చేసి శుక్రవారం రోడ్డు పనులను చేపట్టారు. ఈ సందర్భంగా యువకులు, గ్రామస్థులు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రోడ్డు పనులు చేపట్టామన్నారు.

Updated Date - 2023-06-03T00:24:32+05:30 IST