బియ్యం.. ప్రియం

ABN , First Publish Date - 2023-01-18T00:33:38+05:30 IST

బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఏటా సీజనలో క్వింటం రూ.3000 ఉండే ధర.. ఈ ఏడాది రూ.3,600 పలుకుతోంది. ఈ ధర సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఖరీఫ్‌ సీజన ప్రారంభంలో రూ.3000 ఉన్న ధర.. రెండు నెలల వ్యవధిలో రూ.600 పెరిగింది. హెచ్చెల్సీ ఆయకట్టులో దాదాపు 22 వేల ఎకరాలలో వరి సాగైంది.

బియ్యం.. ప్రియం

క్వింటం ధర రూ.3,600

కణేకల్లు, జనవరి 17: బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఏటా సీజనలో క్వింటం రూ.3000 ఉండే ధర.. ఈ ఏడాది రూ.3,600 పలుకుతోంది. ఈ ధర సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఖరీఫ్‌ సీజన ప్రారంభంలో రూ.3000 ఉన్న ధర.. రెండు నెలల వ్యవధిలో రూ.600 పెరిగింది. హెచ్చెల్సీ ఆయకట్టులో దాదాపు 22 వేల ఎకరాలలో వరి సాగైంది. ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పెరిగింది. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ధరలు తక్కువగా ఉంటాయని అందరూ భావించారు. సీజన ప్రారంభంలో వరి క్వింటం ధర రూ.1950 నుంచి రూ.2050 మధ్య ఉన్నింది. ఈ ధరకే రైతులు సంతోషపడ్డారు. ఆ తరువాత కర్ణాటక ప్రాంతంలోని కాటికకు చెందిన దళారులు రంగప్రవేశం చేయడంతో ధరలు మరింత పెరిగాయి. క్వింటానికి రూ.2,300 నుంచి రూ. 2,500 వరకు ఇచ్చారు. ఈ కారణంగా బియ్యం ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Updated Date - 2023-01-18T00:33:42+05:30 IST