సొసైటీ గోడౌన్ల నిర్మాణంపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-26T00:31:01+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఆప్కాబ్‌, నాబార్డు సహ కారంతో నిర్మిస్తున్న గోడౌన్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏడీసీసీ బ్యాంకు సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ

సొసైటీ గోడౌన్ల నిర్మాణంపై సభ్యుల ఆగ్రహం

గందరగోళంగా ఏడీసీసీ బ్యాంకు సర్వసభ్య సమావేశం

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 25: ఉమ్మడి జిల్లాలో ఆప్కాబ్‌, నాబార్డు సహ కారంతో నిర్మిస్తున్న గోడౌన్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏడీసీసీ బ్యాంకు సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఏడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సర్వసభ్యసమావేశం నిర్వహించారు. సొసైటీ సభ్యులు ప్రధానంగా గోడౌన్ల నిర్మాణం, స్థలాల ఎంపిక, లీజు వ్యవహారాల్లో స్థానిక సభ్యులకు కనీస సమాచారం, భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. నామమాత్రంగా ఉన్న ఆర్‌బీకేలను సొసైటీలకు ఎందుకు అనుసంధానం చేయడం లేదని నిలదీశారు. తమ మండలాల్లో పెట్రోలు బంకుల ఏర్పాటుకు నాబార్డు, ఆప్కాబ్‌లు ముందుకు రావాలని సభ్యులు పట్టుబట్టారు. దీనికి ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన, సీఈఓ ఏబీ రాంప్రసాద్‌ స్పందిస్తూ గోడౌన్ల నిర్మాణం మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని, ఇందులో ఏడీసీసీ బ్యాంకు అధికారులకు సంబంధం లేదన్నారు. పెట్రోలు బంకుల ఏర్పాటు తమ పరిధిలో లేదని కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకే చేపడుతామన్నారు. ఆర్‌బీకేలను సొసైటీలతో అనుసంధానం చేసి, ప్రతి ఏటా ఆడిట్‌ చేస్తామని, సొసైటీ సీఈఓలకు తప్పనిసరిగా పాలకవర్గంలో ఓటు హక్కు ఉండాలని, కామనసర్వీ్‌స సెంటర్‌లో విమాన, రైలు, బస్సు టికెట్లు బుకింగ్‌ సదుపాయం కల్పించామన్నారు. బ్యాంకు నిరర్థక ఆస్థులు రూ.70.64కోట్లు ఎనపీఏ కింద నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో డీసీఓలు అనంతపురం ప్రభాకర్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా కృష్ణానాయక్‌, నాబార్డు డీడీఎ అనురాధా, ఆప్కాబ్‌ జనరల్‌ మేనేజర్‌ కృష్ణారావు, పాలకవర్గసభ్యులు జనార్దనరెడ్డి, రామాంజినేయులు, శంకర్‌రెడ్డి, రమణామూర్తి, అబ్దుల్‌ రఖీబ్‌, జనరల్‌ మేనేజర్‌ సురేఖ రాణి, డీజీఎంలు రవికుమార్‌, సుఖదేవబాబు, యాలేరు అధ్యక్షుడు ఆత్మరామిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:31:01+05:30 IST