Share News

హెచ్చెల్సీ వంతెనకు మరమ్మతు చేయండి

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:01 AM

స్థానిక చిక్కణ్ణేశ్వరచెరువుకు అనుబంధంగా ఉండి ఇటీవల కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించి రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని టీడీపీ నాయకులు కోరారు.

హెచ్చెల్సీ వంతెనకు మరమ్మతు చేయండి

కణేకల్లు, డిసెంబరు 21: స్థానిక చిక్కణ్ణేశ్వరచెరువుకు అనుబంధంగా ఉండి ఇటీవల కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించి రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని టీడీపీ నాయకులు కోరారు. గురువారం వారు హెచ్చెల్సీ అధికారులకు వినతిపత్రం అందించారు. 20 రోజుల క్రితం శిథిలావస్థకు చేరిన హెచ్చెల్సీ వంతెన కూలడంతో గంగలాపురం, రచ్చుమర్రి గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భూములున్న అనేకమంది రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం మాగాణి భూములలో వరికోతలు ప్రారంభం కాగా పొలాలలోకి వెళ్లేందుకు దారి లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్చెల్సీ అధికారులు స్పందించి వెంటనే కూలిన వంతెన స్థానంలో ప్రత్యామ్నా య దారి ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, బీటీ రమేష్‌, షేక్‌ముజ్జు, చాంద్‌బాషా, మాబుసాబ్‌, షేక్‌హుస్సేన, కురుబ నాగరాజు, ఈరప్ప, టుంకూరు నజీర్‌, గంగలాపురం గ్రామస్థులు మహేష్‌, మల్లయ్య, కుపేంద్ర, జగన్నాథ్‌, రామాంజి, రవి, నాగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 01:01 AM