6వేలకు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ
ABN , First Publish Date - 2023-04-03T00:13:53+05:30 IST
చాట్‌బాట్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీ 6వేల మైలురాయి దాటినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రికవరీ చేసిన 382 మొబైల్ ఫోన్లు ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు.
రూ.9.75కోట్ల విలువైన 6026 ఫోన్ల అందజేత: ఎస్పీ
అనంతపురం క్రైం, ఏప్రిల్ 2: చాట్‌బాట్ ద్వారా మొబైల్ ఫోన్ల రికవరీ 6వేల మైలురాయి దాటినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రికవరీ చేసిన 382 మొబైల్ ఫోన్లు ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు రూ.9.75కోట్ల విలువైన 6026 మొబైల్ ఫోన్లు అందజేశామన్నారు. 15 ఇతర రాషా్ట్రల ప్రజలకు, రాష్ట్రంలోని 18 జిల్లాల ప్రజలకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. పోలీ్‌సస్టేషన్లకు వెళ్లకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి అందించాలనే సంకల్పంతో గత ఏడాది మార్చి 17న వాట్సాప్ సేవలు, మరింత సులువైన సేవలు అందించడానికి గత ఏడాది జూన 26న చాట్ బాట్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం మొబైల్ ఫోన్ల రికవరీలో శ్రమించిన జిల్లా పోలీసులకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేంద్రుడు, త్రీటౌన సీఐ కత్తి శ్రీనివాసులు, గుంతకల్లు వనటౌన సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐలు సుధాకర్‌యాదవ్, యువరాజు, ఆర్‌ఎ్‌సఐ రమే్‌షనాయక్ తదితరులు పాల్గొన్నారు.