రామాపురం గోశాల చేరిన మూగజీవాలు
ABN , First Publish Date - 2023-03-02T23:51:15+05:30 IST
ఎట్టకేలకు పోలీసులు మూజీవాలను రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
తనకల్లు, మార్చి 2: మండలపరిఽధిలోని కొక్కంటి క్రాస్‌లో రెండు రోజులక్రితం కంటైనర్‌లో తరలిస్తున్న మూగజీవాలను న్యాయపరిరక్షణ సమితి, విహెచపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈవిషయాన్ని తహసీల్దార్ మధునాయక్, ఎస్‌ఐ రాంభూపాల్‌కు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ పశువులను తంబళ్లపల్లి వద్ద ఉన్న గోశాలకు తరలించారు. అక్కడ నిర్వాహకులు ట్యాగులు లేకుండా తాము గోశాలలో పశువులను ఉంచుకోమని తిరిగి వెనక్కు పంపారు. దీంతో రెండురోజులపాటు నీరు, మేతలేక మూగజీవాలు అలమటించాయి. ఎట్టకేలకు పోలీసులు మూజీవాలను రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న గోశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.