అనంతలో వాన

ABN , First Publish Date - 2023-06-26T00:18:18+05:30 IST

అనంత నగరంలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఆ వర్షానికే నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. రామ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ కింది వైపున భారీగా నీరు చేరింది. ఆ నీటిలో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.

అనంతలో వాన

మోస్తరు వర్షానికి రోడ్లు జలమయం..

వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

అనంతపురం అర్బన, జూన 25: అనంత నగరంలో ఆదివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఆ వర్షానికే నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. రామ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ కింది వైపున భారీగా నీరు చేరింది. ఆ నీటిలో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. బైక్‌లు మునిగిపోయేంత స్థితిలో నీరు నిలిచిపోయింది. వర్షం సమయంలో కమలానగర్‌, హౌసింగ్‌ బోర్డు, ఆర్టీసీ బస్టాండు సమీప ప్రాంతాల్లో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం ఆగిపోయిన తర్వాత కూడా విద్యుత సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

పలు ప్రాంతాల్లో చిరుజల్లులు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. రాప్తాడులో ఓ మోస్తరు, యాడికి, పుట్లూరు, పామిడి, గార్లదిన్నె, గుంతకల్లు, కూడేరు, బెలుగుప్ప, ఉరవకొండ, బొమ్మనహాళ్‌, నార్పల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

Updated Date - 2023-06-26T00:18:18+05:30 IST