వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2023-06-02T23:37:46+05:30 IST

మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలమట్టం అవ్వడంతో రెండురోజులుగా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

వర్ష బీభత్సం

డీ.హీరేహాళ్‌, జూన 2: మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలమట్టం అవ్వడంతో రెండురోజులుగా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. భారీ ఈదురుగాలులు, వర్షానికి ఉద్యాన పంటలు, ఇతర పంటలు సాగు చేసిన రైతులకు భారీ నష్టం జరిగింది. శుక్రవారం ఉదయం దాకా వాగులు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. మండలంలోని పులకుర్తి, మల్లికేతి, సోమలాపురం, డీ.హీరేహాళ్‌ తదితర గ్రామాలలో రైతులు సాగు చేసిన దానిమ్మ, అంజూర, పత్తి, మిరప తదితర పంటలు వర్షానికి పూర్తిగా మునిగి పోయాయి. గ్రామాలలో పిడుగుపాటుకు మూడు ఎద్దులు మృతి చెందాయి.

Updated Date - 2023-06-02T23:37:46+05:30 IST