పాత పెన్షన విధానం కోసం రైల్వే కార్మికులు ఉద్యమించాలి
ABN , First Publish Date - 2023-09-26T00:25:25+05:30 IST
కొత్త పెన్షన విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేసేంతవరకు ఉద్యమించడానికి కార్మికులు సిద్ధం కావాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన కార్యదర్శి ప్రభాకర్ పేర్కొన్నారు.

గుత్తి, సెప్టెంబరు 25: కొత్త పెన్షన విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేసేంతవరకు ఉద్యమించడానికి కార్మికులు సిద్ధం కావాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన కార్యదర్శి ప్రభాకర్ పేర్కొన్నారు. గుత్తి ఆర్‌ఎస్‌లోని ఆర్‌కే ఫంక్షన హల్‌లో సోమవారం రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో దక్షిణ మధ్య రైల్వేలోనే నెంబర్1 ఆర్గనైజేషనగా తమ సంఘం ఉందన్నారు. రైల్వేలో పాత పెన్షన అమలుకు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలన్నారు. అక్టోబరులో గుంతకల్లు రైల్వే డివిజనలో జనరల్ కార్యదర్శి మర్రిరాఘవయ్య ఆధ్వర్యంలో పాత పెన్షనను పునరుద్ధరించాలని నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సంఘ్ డివిజన అధ్యక్షుడు బాబు, డిప్యూటీ డివిజనల్ కార్యదర్శులుడీఎన రెడ్డి, మల్లికార్జున, సీడబ్ల్యూసీ సభ్యులు కుళ్లాయప్ప, డీజిల్ షెడ్ బ్రాంచ కార్యదర్శి సుభాష్‌బాబు, చైర్మన సుధాకర్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.