Share News

టీడీపీ ప్రభుత్వం రాగానే బీసీలకు రక్షణ చట్టం

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:13 AM

టీడీపీ అధికారంలోకి రా గానే బీసీలకు రక్షణ చట్టం అమల్లోకి తెస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుం ఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు.

టీడీపీ ప్రభుత్వం రాగానే బీసీలకు రక్షణ చట్టం
మాట్లాడుతున్న ప్రభాకర్‌ చౌదరి

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, డిసెంబరు 16: టీడీపీ అధికారంలోకి రా గానే బీసీలకు రక్షణ చట్టం అమల్లోకి తెస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుం ఠం ప్రభాకర్‌ చౌదరి అన్నారు. శనివారం అనంతపురం అర్బన టీడీపీ కా ర్యాలయంలో రజక సాఽధిమాట్లాడుతున్న ప్రభాకర్‌ చౌదరి కార సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ... టీడీపీ హయాంలో దోబీఘాట్‌లు నిర్మించి, నీటి సదుపాయం క ల్పించామన్నారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశామన్నారు. వైసీపీ పాలనలో రజకులకు చేసిందేమీ లేదన్నారు. రాబోవు ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం పనిచేయాలన్నారు. రజక సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ రామకృష్ణ, టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు, రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళీ, నాయకులు రమేష్‌ బాబు, వెంకటేష్‌, శోభ, కృష్ణమూర్తి, నారాయణస్వామి, కృష్ణ, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:13 AM