Share News

Salaar: ‘సలార్’ సినిమా ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి

ABN , Publish Date - Dec 22 , 2023 | 09:28 AM

హీరో ప్రభాస్ సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ అభిమాని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగింది. బాలరాజు (29) అనే ప్రభాస్ అభిమాని సలార్ విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. దానికి ఉన్న ఇనుప ఫ్రేమ్ కరెంట్ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు.

Salaar: ‘సలార్’ సినిమా ఫ్లెక్సీ కడుతూ ప్రభాస్ అభిమాని మృతి

అనంతపురం: హీరో ప్రభాస్ సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ అభిమాని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగింది. బాలరాజు (29) అనే ప్రభాస్ అభిమాని సలార్ విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. దానికి ఉన్న ఇనుప ఫ్రేమ్ కరెంట్ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 09:28 AM