Share News

గుంతల రోడ్లు.. కాపు అవినీతికి ఆనవాళ్లు

ABN , First Publish Date - 2023-11-19T23:36:38+05:30 IST

మండలంలోని కణేకల్లు-కొత్తపల్లి మధ్య ఉన్న గుంతలుపడ్డ రహదారి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతికి ఆనవాళ్లు అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

గుంతల రోడ్లు.. కాపు అవినీతికి ఆనవాళ్లు
కణేకల్లు-కొత్తపల్లి రహదారిని పరిశీలిస్తున్న కాలవ, టీడీపీ, జనసేన నాయకులు

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

కణేకల్లు, నవంబరు 19: మండలంలోని కణేకల్లు-కొత్తపల్లి మధ్య ఉన్న గుంతలుపడ్డ రహదారి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతికి ఆనవాళ్లు అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. నియోజకవర్గ ఇనచార్జి మంజునాథ్‌గౌడ్‌తో కలిసి గుంతల ఆంధ్రప్రదేశకు దారేది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపల్లి రహదారి మీదుగా ప్రతి నిత్యం వందలాది ఇసుక టిప్పర్లు తిరిగి రచ్చుమర్రి రీచ నుంచి కర్నాటకకు తరలిపోవడంతో ఈ రోడ్డంతా గుంతల మయంగా మారిందన్నారు. ఇసుక అక్రమ రవాణాతో కోట్లు సంపాదించిన కాపు ఈ రహదారిపై పూర్తి నిర్లక్ష్యం వహించి గంపెడు మట్టి కూడా వేయలేదని వారు మండిపడ్డారు. అలాగే హనకనహాళ్‌ నుంచి బెళుగుప్పకు వెళ్లే రహదారి కూడా ప్రయాణానికి అధ్వానంగా ఉందన్నారు. మండలంలోని హనుమాపురం గ్రామంలో సర్పంచ, ఎంపీటీసీలుగా గెలిచిన తమ పార్టీ అభ్యర్థులు జయరాంచౌదరి, నరేంద్రబాబులకు గ్రామాభివృద్ధికి ఏమాత్రం నిధులు విడుదల చేయకుండా వైసీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కాలవ మండిపడ్డారు. టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, కళేకుర్తి సుదర్శన, బాయినేని నవీన, బీటీ రమేష్‌, షేక్‌ముజ్జు, చంద్రశేఖ ర్‌ గుప్తా, కురుబ నాగరాజు, వన్నారెడ్డి, మాల్యం శరభనగౌడ్‌, కృష్ణారెడ్డి, అశోక్‌, నాగభూషణం, వరుణ్‌, సలీం, అబ్దుల్‌, క్రిష్టప్ప, శేషప్ప, ఈరప్ప, మహమ్మద్‌, జనసేన కన్వీనర్‌ రవి పాల్గొన్నారు.

మంత్రి నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణం

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు

కుందుర్పి: మంత్రి నియోజకవర్గంలో గ్రామీణ రహదారులన్నీ దారుణంగా మారిపోయాయని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు విమర్శించారు. ఆదివారం కుందుర్పి మండల పరిధిలోని మహంత పురం, కదరంపల్లికి వెళ్లే కంకర రహదారిపై టీడీపీ, జనసేన సంయుక్తంగా నిరసన చేపట్టారు. ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు గ్రామీణ రహదారులను ఏ మాత్రం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యపు పరిపాలన కొనసాగించారని అన్నారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జి రాజేష్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

ఉరవకొండ: వైసీపీ ప్రభుత్వం రోడ్డు అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఏపీ ఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం ధ్వజమెత్తారు. రోడ్డు దుస్థితిపై టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో గుంతలు పడిన రహదారిపై మట్టివేసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. వజ్రకరూరు మండల కన్వీనర్‌ నూతేటి వెంకటేష్‌, పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, టీడీపీ నాయకులు గోవిందు, ప్యారం కేశవానంద, వ్యాసాపురం సర్పంచు సీతారాములు, ఎర్రిస్వామి, జల్లిపల్లి శ్రీన, మాజీ సర్పంచు ఎర్రిస్వామి, ప్రభాకర్‌, సుధాకర్‌, బాలచంద్ర, శంకరయ్య, సుదర్శన, హరి, తెలుగు యువత నాయకులు మణి, గురుస్వామి, నూర్‌, విశ్వనాథ్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

గుంతల రోడ్లకు గంప మట్టైనా వేశారా..?

బెళుగుప్ప: వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో గుంతల రోడ్లు మరమ్మతులకు గంపెడు మట్టైనా వేశారానని టీడీపీ, జనసేన నాయకులు ప్రశ్నించారు. మండలంలోని ఆవులెన్నలో ఆదివారం మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా వున్న రోడ్డును పరిశీలించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తున్నామని గొప్పలు చెబుతోంది తప్ప వేసింది లేదన్నారు. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని స్థానిక సర్పంచ్‌ రాము వాపోయారు. నాయకులు ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు పెద్ద తిప్పయ్య, సర్పంచ్‌ రాము, ఉపసర్పంచ్‌ మస్తాన్‌, యర్రిస్వామి, అంజి, మనోహర, వెంకటస్వామి, యలగలవంక సురేష్‌, జనసేన నాయకులు సుధీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:36:39+05:30 IST