ఇద్దరికి పాజిటివ్
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:09 AM
సుదీర్ఘ విరామం తరువాత జిల్లాలో కొవిడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లా ఆస్పత్రి ఓపీకి బుధవారం వచ్చినవారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 42 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
చాన్నాళ్ల తరువాత కొవిడ్ ఆనవాళ్లు
అనంతపురం టౌన, డిసెంబరు 27: సుదీర్ఘ విరామం తరువాత జిల్లాలో కొవిడ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లా ఆస్పత్రి ఓపీకి బుధవారం వచ్చినవారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 42 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కళ్యాణదుర్గానికి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు, అనంతపురం లక్ష్మీనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు బుధవారం వెల్లడించారు. ఈ సమాచారాన్ని డీఎంహెచఓకు తెలియజేశామని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరు కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యులు, వారి ప్రైమరీ కాంటాక్ట్ కేసులను గుర్తించి.. అవసరమైతే కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ.. ఆస్పత్రికి వచ్చినవారికి కొవిడ్ పరీక్షలను నిర్వహించారు.