Share News

పోలీసు క్రీడాపోటీలు ప్రారంభం

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:22 AM

పుట్టపర్తి రూరల్‌, డిసెంబర్‌ 27: జిల్లా కేంద్రంలోని శిరసాని పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ బుధవారం ప్రారంభమైంది.

పోలీసు క్రీడాపోటీలు ప్రారంభం

పుట్టపర్తి రూరల్‌, డిసెంబర్‌ 27: జిల్లా కేంద్రంలోని శిరసాని పోలీసు పరేడ్‌ మైదానంలో పోలీసు స్పోర్ట్స్‌ మీట్‌ బుధవారం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ క్రీడలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతతోపాటు చక్కటి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. తద్వారా పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు, డీఎస్పీలు వాసుదేవన, పృథ్వీ, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, సీఐలు రాగిరి రామయ్య, కొండారెడ్డి, రాజేంద్రనాథ్‌ యాదవ్‌, ఆర్‌ఐలు రాజశేఖర్‌రెడ్డి, టైటాస్‌, నారాయణ, ఆర్‌ఎ్‌సఐలు వెంకటేశ్వరరావు, రాజుప్రతా్‌పసింగ్‌,ఏఎ్‌సఐ శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:22 AM