Share News

అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు: సవిత

ABN , First Publish Date - 2023-10-25T00:11:25+05:30 IST

అధికార పార్టీ కార్యకర్తలుగా పోలీసులు వ్వవహరి స్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు.

అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు: సవిత

పెనుకొండ టౌన, అక్టోబరు 24: అధికార పార్టీ కార్యకర్తలుగా పోలీసులు వ్వవహరి స్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు. మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి ఆమె చేపట్టారు. ఈ క్రమంలో సైకో పోవాలి పోస్టర్లలను దహనం చేసే కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి తెలుగుతల్లి కూడలి వద్ద నిర్వహిస్తుండగా... పోలీసులు అడ్డుకుని సవితను స్టేషనకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, సవితకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా మానాయకుడు చంద్రబాబు అక్ర మ అరెస్ట్‌ కు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవ డం ఏమిటిని ప్రశ్నించారు. ఈ తోపులాటలో సవిత దుస్తులు చిరిగి పోయాయి. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ సీఎం జగన అండతో పలు అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులను పోలీసులు స్వేచ్ఛగా వదలి వేశారన్నారు. ఈ జగనాసురుడికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Updated Date - 2023-10-25T00:11:25+05:30 IST