Share News

జగనను సాగనంపడానికి సిద్ధమైన జనం

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:53 PM

రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు.

జగనను సాగనంపడానికి సిద్ధమైన జనం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు

కుందుర్పి, డిసెంబరు 17: రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం కుందుర్పిలో నిర్వహించారు. సమావేశంలో ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ భావితరాలకు ఉత్తమ భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. సంపద సృష్టించి రాషా్ట్రన్ని అభివృద్ధి బాటలో నడిపించడం ఆయనకే సొంతమన్నారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికి టీడీపీని గెలిపించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. అనంతరం ఉమామహేశ్వరనాయుడును అభిమానులు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కుందుర్పి మండల కన్వీనర్‌ ధనుంజయ, గ్రామ కన్వీనర్‌ రంగనాథ్‌, శెట్టూరు గ్రామ కన్వీనర్‌ తిప్పేస్వామి, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, మాజీ మార్కెట్‌ యార్డు చైౖర్మన్‌ దొడఘట్ట నారాయణ, మురళి, తలారి సత్తి, రామరాజు, గోవిందరాజులు, సురేంద్ర, పెద్ద నరసింహప్ప, మల్లికార్జున, రామకృష్ణ, నాగరాజు, రామిరెడ్డి, రామాంజినేయులు, గవిసిద్ద, నాగేంద్ర, ప్రసాద్‌, వివిధ గ్రామాల గ్రామ కన్వీనర్లు, ఎంపీటీసీ మల్లికార్జున, టీడీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:53 PM