‘పేదలకు అండగా పరిటాల కుటుంబం’
ABN , First Publish Date - 2023-05-25T23:33:53+05:30 IST
నియోజకవర్గంలో పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా పరిటాల కుటుంబం అండగా ఉంటుందని టీడీపీ మండల నా యకులు పేర్కొన్నారు.

తాడిమర్రి, మే 25: నియోజకవర్గంలో పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా పరిటాల కుటుంబం అండగా ఉంటుందని టీడీపీ మండల నా యకులు పేర్కొన్నారు. టీడీపీ మండల కన్వీ నర్ కూచిరామ్మోహన ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి మాట్లాడారు. పెద్దకోట్ల గ్రామానికి చెందిన గంగయ్య అనే వైసీపీ కార్యకర్త టీడీపీలోకి చేరిన మరుసటి రోజే ఆయనకు సంబంధిం చిన బోరుబావి పూడ్చడం వాస్తవం కాదా అని వైసీపీ మండల నాయ కులను ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవని, టీడీపీ వారు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటున్న మీరు నిజాయితీగా పోలీసులతో విచారణ జరిపించాలన్నారు. నిజంగా బోరుపూడ్చిన వారు ఎవరో గుర్తించి శిక్షిస్తే తాము స్వాగతిస్తామన్నారు. గంగయ్యను పరామర్శించడానికి మాత్రమే పరిటాల శ్రీరామ్ వచ్చి ఆర్థిక భరోసా కల్పించారన్నారు. మేము ఫ్యాక్షనను రెచ్చగొట్టే వాళ్లమైతే వైసీపీ నాయకులపై కేసు పెట్టేవారమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు హర్షవర్దన, రామానాయుడు, బాలగంగిరెడ్డి, కురుబసంఘం నాయ కుడు లక్ష్మీనారాయణ, బద్రి, ఆత్మకూరు శ్రీనివాసులు, గంగయ్య, యల్ల ప్ప, ఎస్సీ నాయకులు గణేశ, భాస్కర్‌గౌడ్, నాగరాజు పాల్గొన్నారు.