Share News

ఇక.. వైసీపీ గల్లంతే..

ABN , First Publish Date - 2023-12-10T23:36:32+05:30 IST

వైసీపీ గల్లంతవడం ఖాయమని, ఎన్నికల్లో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చె ందిన వారు పల్లె సమక్షంలో ఆదివారం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

ఇక.. వైసీపీ గల్లంతే..
బైక్‌ ర్యాలీలో పాల్గొన్న పల్లె రఘునాథరెడ్డి

మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి

టీడీపీలోకి భారీగా చేరికలు

16 కిలోమీటర్లు బైక్‌ ర్యాలీ

కదంతొక్కిన తెలుగుతమ్ముళ్లు

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 10: వైసీపీ గల్లంతవడం ఖాయమని, ఎన్నికల్లో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తంగేడుకుంట పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చె ందిన వారు పల్లె సమక్షంలో ఆదివారం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈసందర్భంగా పల్లె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు వైసీపీతో రక్షణ లేకుండా పోయిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ప్రజలను భయభ్రాంతులకు లోనుచేస్తున్న ఘనత వైసీపీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాఽధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే, టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబునాయుడే అన్నారు. వైసీపీ ఆగడాలకు టీడీపీ కార్యకర్తలు అడ్డుకట్ట వేయాలన్నారు. నాలుగున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెరిగిపోయాయని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.

16 కిలోమీటర్లు బైక్‌ ర్యాలీ

మండలంలోని మద్దకవారిపల్లిలో వందలాది కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న సందర్భంగా ఓబుళదేవరచెరువు టీడీపీ కార్యాలయం నుంచి మద్దకవారిపల్లి వరకు 16 కిలోమీటర్లు భారీ బైక్‌ర్యాలీ కొనసాగింది. ఈబైక్‌ ర్యాలీని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ప్రారంభించారు. బైక్‌ ర్యాలీపై అడుగడుగునా టీడీపీ నాయకులు పూలవర్షం కురిపించారు. ఈ ర్యాలీతో నాయకులు, కార్యకర్తలో నూతన ఉత్సహం నిండింది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్‌ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, పీట్ల సుధాకర్‌, ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి కాలేనాయక్‌, జిల్లా అధికారప్రతినిధి వలిపి సోమశేఖర్‌, బూదిలి ఓబుళరెడ్డి, జాకీర్‌ అహమ్మద్‌, హర్షీన ఖాన, చాంద్‌బాషా, ఈశ్వరయ్య, ఆంజనప్ప, హనుమంతురెడ్డి, క్రిష్ణమూర్తి, మస్తానమ్మ, గంగాద్రి, అబ్బాస్‌, శ్రీనివాసులు, నాగరాజు, ఆంజనరెడ్డి, శివారెడ్డి, నారప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:36:35+05:30 IST