ఉపాధ్యాయులను అవమానించేలా ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-03-31T00:05:52+05:30 IST

ఉపాధ్యాయులను తహశీల్దార్‌ కార్యాల యంలో రిపోర్టు చేయమనడం, వారిని అవమానించడమేనని ఎస్‌టీయూ సత్యసాయి జిల్లా సంఘం నాయకులు పేర్కొన్నారు.

ఉపాధ్యాయులను అవమానించేలా ఉత్తర్వులు

వెంటనే ఉపసంహరించుకోవాలి: ఎస్‌టీయూ

కదిరి అర్బన, మార్చి 30 : ఉపాధ్యాయులను తహశీల్దార్‌ కార్యాల యంలో రిపోర్టు చేయమనడం, వారిని అవమానించడమేనని ఎస్‌టీయూ సత్యసాయి జిల్లా సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల సందర్భంగా... గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఉపాధ్యాయులను తహసీల్దార్‌ కార్యాలయంలో రిపోర్టు చేయమనడం ఉపాధ్యాయులను అవమానపరచడమే అంటూ ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జీ రామ్మోహన, ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాసు లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని, అయితే ఈ ఏడాది కూడా పదోతరగతి పరీక్షల సందర్భంగా వారిని తహశీల్దార్‌ కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పడం ఏమిట న్నారు. వారేమైనా రౌడీషీటర్లా లేక అల్లరిమూకలా అని ప్రశ్నించారు. వీలైతే వారిని ఈ ఏడాది పదోతరగతి పరీక్షల ఇన్విజిలేషన విధుల నుంచి తప్పిం చాలే కానీ ఈ విధంగా ఉపాధ్యాయులను అవమానించడం సరికాదన్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులను కమిషనర్‌ ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలన్నారు.

Updated Date - 2023-03-31T00:05:52+05:30 IST