ఓపీఎస్‌ మాత్రమే ప్రత్యామ్నాయం : యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2023-09-04T23:45:04+05:30 IST

సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం జీపీఎస్‌ కాదని ఓపీఎస్‌ మాత్రమే అని యూటీఎఫ్‌ మండల అధ్యక్షు లు మహలింగప్ప, ప్రధాన కార్యదర్శి మూడ్ల గిరియప్ప, జోగప్ప తది తరులు అన్నారు.

 ఓపీఎస్‌ మాత్రమే ప్రత్యామ్నాయం : యూటీఎఫ్‌

మడకశిరటౌన, సెప్టెంబరు 4: సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం జీపీఎస్‌ కాదని ఓపీఎస్‌ మాత్రమే అని యూటీఎఫ్‌ మండల అధ్యక్షు లు మహలింగప్ప, ప్రధాన కార్యదర్శి మూడ్ల గిరియప్ప, జోగప్ప తది తరులు అన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈసందర్భంగా యూటీఎఫ్‌ నాయకులు మాట్లాడు తూ... ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన జీపీఎస్‌ ఆర్డినెన్సను రద్దు చేసుకోవాలని, సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం ఓపీఎస్‌ మాత్రమే అన్నా రు. ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అనేక సమావేశాల్లో సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని చెప్పారని అన్నారు. ఆ హామీ మేరకు వెంటనే ఓపీఎస్‌ను అమలుచేసి ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకో వాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవా ధ్యక్షులు భూతన్న, గుడిబండ మండల అధ్యక్షుడు నరసింహప్ప, మడకశిర ఏపీజీఈఏ నాయకులు గోవిందప్ప, ఈశ్వర్‌, రంగనాథ్‌, మహంతి, రమేష్‌, రామాంజి, నంజప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:45:04+05:30 IST