Share News

విద్యార్థులతో జాతీయస్థాయి గుర్తింపు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:08 AM

విద్యతోపాటు సమాజిక సేవా గుణాలున్న విద్యార్థుల ద్వారా ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభిస్తోందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర తెలిపారు.

విద్యార్థులతో జాతీయస్థాయి గుర్తింపు

ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 16: విద్యతోపాటు సమాజిక సేవా గుణాలున్న విద్యార్థుల ద్వారా ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభిస్తోందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర తెలిపారు. నేషనల్‌ అడ్వెంచర్‌ క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులను శనివారం ప్రిన్సిపాల్‌ ఆయన కార్యాలయంలో అభినందించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఎనఎ్‌సఎ్‌స విద్యార్థుల సేవలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోందన్నారు. విద్యార్థులు సింధు, భోళానాథ్‌రెడ్డి నేషనల్‌ అడ్వెంచర్‌ క్యాంప్‌కు ఎంపికయ్యారన్నారు. 19 నుంచి 28వ తేదీ వరకు శిక్షణా తరగతుల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:08 AM