చెక్కభజనకు జాతీయ స్థాయి అవార్డు
ABN , First Publish Date - 2023-12-10T23:49:50+05:30 IST
మండలంలోని లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జా తీయ స్థాయిలో నంది అవార్డు అందుకున్నారు. విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక, సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం-2023కు సంబంధించి జాతీయ పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
గుత్తి,డిసెంబరు 10: మండలంలోని లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జా తీయ స్థాయిలో నంది అవార్డు అందుకున్నారు. విజయవాడలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక, సంగీత, సాహిత్య, నృత్య సమ్మేళనం-2023కు సంబంధించి జాతీయ పురస్కారాల మహోత్సవం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లచ్చానుపల్లి గ్రామానికి చెందిన షేక్ చిన్నజమాల్ వలి చెక్క భజనలో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పూర్ణచంద్రచార్యులు, కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ శర్మ, తమిళనాడు శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి, జాతీయ సమన్వయ కర్త ప్రదీప్ కుమార్ చేతుల మీదుగా నంది అవార్డును బహూకరించారు. ఆత్మీయ సన్మాన జ్ఞాపికను అందజేశారు. గతంలో ఆయన రాష్ట్ర, జాతీయ స్థాయి చెక్క భజనలో అవార్డు అందుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు చెక్క భజన నేర్పించే ఆయన గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో నంది అవార్డును అందుకోవడం పట్ల గ్రామస్థులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
నంది అవార్డు అందుకుంటున్న షేక్ చిన్నజమాల్ వలి