టీడీపీతోనే రాషా్ట్రభివృద్ధి

ABN , First Publish Date - 2023-09-04T23:55:30+05:30 IST

తెలుగుదేశం పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ పేర్కొన్నారు.

టీడీపీతోనే రాషా్ట్రభివృద్ధి

గుత్తిరూరల్‌,సెప్టెంబర్‌ 4: తెలుగుదేశం పార్టీతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని తెలుగు మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి సరోజమ్మ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని జక్కలచెరువులో మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా తలారి సరోజమ్మ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మహిళలు ఆర్ధికాభివృద్ధి చెందారన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళలకు ఎన్నో పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జింకల నారాయణస్వామి, మాజీ సర్పుంచ లక్ష్మీనారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ, టీడీపీ నాయకులు రామాంజనేయులు, బాలరాజు, రమణ, రాజన్న బండి లక్ష్మీదేవి, లీలావతి, అంజలీదేవి, బీఎల్‌ లక్ష్మి, జయమ్మ, మాధవి, ఫజీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T23:55:30+05:30 IST