NARA LOKESH: అబద్ధాల మోహన్.. ఓ డ్రాయర్ ఫ్యాక్టరీనైనా తెచ్చావా?
ABN , First Publish Date - 2023-04-01T03:12:06+05:30 IST
అబద్ధాల మోహన్ రాష్ట్రానికి ఓ కడ్రాయర్ ఫ్యాక్టరీని కూడా తీసుకురాలేదని, ఆయనకు కప్పం కట్టలేక ఉన్న ఫ్యాక్టరీలు పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు.
31 మంది ఎంపీలు ఉండి ఏం పీకావ్?
రాప్తాడు ఎమ్మెల్యేకు కప్పం కట్టలేకే జాకీ జంప్
పేరుకే జేపీ కంపెనీ.. ఇసుక దోపిడీ వైసీపీ నేతలదే
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
పుట్టపర్తి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): అబద్ధాల మోహన్ రాష్ట్రానికి ఓ కడ్రాయర్ ఫ్యాక్టరీని కూడా తీసుకురాలేదని, ఆయనకు కప్పం కట్టలేక ఉన్న ఫ్యాక్టరీలు పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. యువగళం పాదయాత్ర 56వ రోజైన శుక్రవారం.. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం కోన క్రాస్ నుంచి ప్యాదిండి విడిది కేంద్రం వరకు కొనసాగింది. చందమూరు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో కియ, టీసీఎల్, హెచ్‌సీఎల్‌తోపాటు ఎన్నో పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, నాలుగేళ్ల జగన్ పాలనలో ఒక్క కడ్రాయర్ ఫ్యాక్టరీ అయినా తీసుకొచ్చా రా.. అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కప్పం కట్టలేక జాకీ పరిశ్రమ పొరుగు రాష్ట్రాలకు పారిపోయిందన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నా.. జగన్ పీకిందేమీ లేదన్నారు. ఢీల్లీ యాత్రను సొంత యాత్రగా మార్చేశారని.. అన్నారు.
జగన్‌ది పరదాల యాత్ర.. నాది ప్రజా యాత్ర
‘జగన్‌ది పరదాల యాత్ర.. మీ లోకేశ్‌ది ప్రజా యాత్ర’ అని లోకేశ్ ప్రజలనుద్దేశించి అన్నారు. ఏ తప్పూ చేయలేదు కాబట్టి తా ను ధైర్యంగా తిరుగు తున్నానన్నారు. యు వగళం దెబ్బకు వారానికి ఒకసారి ఢిల్లీకి పరిగెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ‘నా వెంట్రుక కూడా పీకలేరన్నాడు.. సిం హం సింగిల్‌గా వస్తుందని అన్నాడు.. ఇప్పుడు.. అయ్యా అందరూ విడివిడిగా పోటీ చేయండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చాడు.. ఇదీ పసుపు జెండా పవర్’ అని లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రకు రాప్తాడు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. లోకేశ్ శుక్రవారం 12.2 కి.మీ నడిచారు. ఇప్పటివరకూ 719.1 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశారు.

జగన్ పనైపోయింది..:
రాష్ట్రంలో సహజ వనరులను జగన్ దోచుకుంటున్నాడని, ఇసుకను జేపీ కంపెనీ పేరుతో కాంట్రాక్ట్ ఇచ్చి వైసీపీ నేతలే దోపిడీ చేస్తూ కోట్లు గడిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇసుక దందాకు బెంగళూరుకు వెళుతున్న టిప్పర్లే నిదర్శనమన్నారు. పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని, వైసీపీ నేతలే ఇసుక అక్రమ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఏం చేశారని ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. అయినా ఆయన తగ్గలేదని, రోడ్డుమీద కుర్చీ వేసుకుని ‘దమ్ముంటే తెల్చుకుందాం రా’ అని జగన్‌కే సవాల్ విసిరారని అన్నారు. ఇది చాలదా జగన్ పనైపోయిందని చెప్పడానికి అని ప్రశ్నించారు.
లోకేశ్ కాళ్లకు బొబ్బలు

ఎండల తీవ్రతతోపాటు.. జాతీయ రహదారిపై ఎక్కువగా నడవడం వల్ల లోకేశ్ కుడికాలి పాదానికి బొబ్బలు వచ్చాయి. దీంతో కోన క్రాస్ వద్ద ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. పాదయాత్రకు కాస్త విరామం ఇవ్వాలని వైద్యులు సూచించినా.. లోకేశ్ వినిపించుకోలేదు.
తాలిబన్ తరహా పాలన!
చెన్నేకొత్తపల్లి మండలం కోనక్రాస్ వద్ద క్యాంప్‌సైట్ నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభించాను. ఎన్‌ఎ్‌స గేటువద్ద జాకీ పరిశ్రమ భూ నిర్వాసితులు నన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాప్తాడు ఎమ్మె ల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి కమీషన్ల కోసం బెదిరించడంతో జాకీ పరిశ్రమ పొరుగురాష్ట్రానికి తరలిపోయిందన్నారు. వైసీ పీ సైకోల వేధింపులు తాళలేక జాకీతోపాటు అమర్‌రాజా, ఫ్యా క్స్ కాన్ వంటి రూ.10 లక్షల కో ట్ల విలువైన పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయాయి. జగన్ నేతృత్వంలో తాలిబాన్ తరహా పరిపాలన సాగుతోందనడనానికి ఇదే నిదర్శనం.
- నారా లోకేశ్