కురుబ కులస్థులతో నారా లోకేశ ముఖాముఖి
ABN , First Publish Date - 2023-01-31T23:23:15+05:30 IST
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా కురుబ కులస్థులతో ముఖాముఖి మాట్లాడారు.
పెనుకొండ, జనవరి 31: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా కురుబ కులస్థులతో ముఖాముఖి మాట్లాడారు. పాదయాత్ర మంగళవారం చిత్తూరు జి ల్లా పలమనేరు నియోజకవర్గం కృష్ణాపురం నుంచి ప్రారంభమైనట్లు పెనుకొండకు చెందిన కురుబ సంఘం నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత తెలిపారు. ఈయాత్రకు ఆమెతోపా టు పలువురు కురుబ సంఘం నాయకులు హాజరై సంఘీభావం తె లిపారు. ఈసందర్భంగా దేవదొడ్డి గ్రామంలో నారాలోకేశ కురుబ కు లస్థులతో ముఖాముఖి మాట్లాడారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ ఎదుగుదలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకు లు అణగదొక్కే చర్యలకు పూనుకుంటున్నారన్నారు. ఆమెకు చెందిన క్వారీ, పెట్రోల్‌బంకులపై దాడులు, అరెస్ట్ చేయించడానికి ప్రయత్నిం చడం సైకో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కిందన్నారు. సైకో ప్ర భుత్వం గద్దె దిగాలంటే కురుబ సామాజిక వర్గమంతా ఏకం కావాలన్నారు. అనంతరం సవిత... కురుబలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేశ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పాదయాత్రలో మాగేచెరువు సర్పంచ
సోమందేపల్లి: టీడీ పీ జాతీయ ప్రధాన కా ర్యదర్శి నారాలోకేశ చేప ట్టిన పాదయాత్రలో పా ల్గొనేందుకు మండల టీ డీపీ నాయకులు బయలుదేరి వెళ్లారు. మంగళవారం పుంగనూరు వద్ద నారాలోకేశను మాగేచెరువు సర్పంచ నరసింహులు కలుసుకుని సంఘీభావం తెలిపారు. అనంతరం పాదయాత్రలో ఐదోరోజు నారాలోకేశతో కలిసి అడుగులేశారు. సర్పంచ వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.