సమస్యలను పరిష్కరించేదాకా పోరాటం
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:18 PM
మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. నగరపాలికలో పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు
సమ్మెలోకి పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు
అనంతపురం క్రైం, డిసెంబరు 26: మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. నగరపాలికలో పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. కార్పొరేషన కార్యాలయం ఎదుట సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన ఆధ్వర్యంలో పనిముట్లతో నిరసన తెలిపారు. అంతకు ముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓఎంఎస్ నంబర్లు 1615, 7ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఏళ్ల తరబడి బకాయి ఉన్న డీఏలు, ఇంక్రిమెంట్‌లు ఇవ్వాలని, స్కిల్డ్, సెమీస్కిల్డ్ వేతనం ఇవ్వాలని కోరారు. నగర విస్తీర్ణం, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. సమ్మెకు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొదిన, భగతసింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన నాయకులు ఆది, ఆజాం మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, మున్సిపల్ వర్కర్స్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకుడు చిరంజీవి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.