అర్ధరాత్రి హైడ్రామా

ABN , First Publish Date - 2023-03-19T00:56:29+05:30 IST

: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. సీమలో సంబరాలు మిన్నంటుతున్నాయి. కౌంటింగ్‌ కేంద్రం నుంచి విజేత బయటకు రావడమే ఆలస్యం.. భుజాలకెత్తుకుని ఊరేగించాలని నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాలవ, పరిటాల సునీత, ప్రభాకర్‌ చౌదరి, పార్థసారథి తదితర ముఖ్య నాయకులు జేఎనటీయూ వద్దకు చేరుకున్నారు. గంటలు గడుస్తున్నాయి

అర్ధరాత్రి హైడ్రామా
రాంగోపాల్‌రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు

గెలుపు డిక్లరేషన ఇవ్వని అధికారులు

గంటల తరబడి భూమిరెడ్డి ఎదురుచూపు

కౌంటింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతల బైఠాయింపు

విజేత సహా టీడీపీ కీలక నాయకుల అరెస్టు

అనంతపురం క్రైం, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. సీమలో సంబరాలు మిన్నంటుతున్నాయి. కౌంటింగ్‌ కేంద్రం నుంచి విజేత బయటకు రావడమే ఆలస్యం.. భుజాలకెత్తుకుని ఊరేగించాలని నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాలవ, పరిటాల సునీత, ప్రభాకర్‌ చౌదరి, పార్థసారథి తదితర ముఖ్య నాయకులు జేఎనటీయూ వద్దకు చేరుకున్నారు. గంటలు గడుస్తున్నాయి. కానీ అభ్యర్థికి ఎన్నికల అధికారులు డిక్లరేషన ఫారం ఇవ్వడం లేదు. దీంతో ఏదో జరుగుతోందని టీడీపీ నాయకులకు అనుమానం మొదలైంది. సంబరాలను కాసేపు ఆపేసి.. సమరానికి దిగారు. జేఎనటీయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అర్ధరాత్రి హైడ్రామా మొదలైంది. నాయకులందరినీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన భూమిరెడ్డిని ఈడ్చుకువెళ్లి మరీ వాహనంలో ఎక్కించారు. నాయకులందరినీ త్రీ టౌన పోలీస్‌ స్టేషనకు తరలించారు. ఈ పరిణామాలు టీడీపీ నాయకులు, శ్రేణుల్లో ఆగ్రహాన్ని పెంచాయి. అర్ధరాత్రి వరకూ.. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి.

డిక్లరేషన ఇవ్వాల్సిందే: టీడీపీ

అనంతపురం క్రైం, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన సర్టిఫికెట్‌ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద భూమిరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రులు కాలవ, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, ప్రభాకర్‌ చౌదరి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు పరిటాల శ్రీరామ్‌, చంద్రదండు ప్రకాష్‌ నాయుడు తదితరులు శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మెజార్టీ సహా గెలుపు ప్రకటించిన అధికారులు డిక్లరేషన ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. సీఎంఓ నుంచి తీవ్రస్థాయి ఒత్తిడి వచ్చినందుకే డిక్లరేషన ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసుల తీరుపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-19T00:56:29+05:30 IST