నిరసన దీక్షను విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2023-11-19T23:39:42+05:30 IST
కృష్ణా జలాల పునఃపంపిణీపై గెజిట్ నోటిఫికేషన రద్దు, కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు తెలిపారు.

యాడికి, నవంబరు 19: కృష్ణా జలాల పునఃపంపిణీపై గెజిట్ నోటిఫికేషన రద్దు, కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు తెలిపారు. ఈనెల 20, 21 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న 30 గంటల నిరసన దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం సీపీఐ నాయకులు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై గెజిట్ రద్దు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తోందని, ప్రభుత్వం నామమాత్రంగా కరువు మండలాలు ప్రకటించిందన్నారు. ప్రజలు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బండారు రాఘవ, గరిడి శివన్న, బాలన్న పాల్గొన్నారు.
పెద్దపప్పూరు: విజయవాడలో 20, 21 తేదీల్లో నిర్వహించనున్న 30 గంటల నిరసన దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం సీపీఐ కార్యదర్శి పురుషోత్తం తెలిపారు. స్థానిక హరేరామ ఆశ్రమంలో పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ కృష్ణాజలాల పునఃపంపిణీ గెజిట్ నోటిఫికేషనను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజలందరూ దీక్షలో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి భోగాతి రామేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.