చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2023-08-02T23:51:33+05:30 IST

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మం డల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

పరిటాల సునీత

ఆత్మకూరు ఆగస్టు 2: చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని మం డల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. కాలువకు భూము లు ఇచ్చిన రైతులు పాల్గొని వారి పరిస్థితిని వివరించాలని కోరారు.

ఏర్పాట్ల పరిశీలన :ఆత్మకూరు మండలం సింగన గుట్టపల్లి వద్దకు చంద్రబాబు నాయకుడు గురు వారం వస్తుండటంతో ప్రధాన రోడ్డు నుంచి ఆ ప్రాం తానికి ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఇరువైపులా కంపచెట్లును తొలగించారు. ఈ పనులను పరిటాల సునీత పరిశీలించారు. రైతులతో నిర్వహించే సమావేశం స్థలాన్ని పరిశీలించారు. గుంతలు లేకుండా మట్టి వేయించి చదును చేయించారు. వాహనాల పార్కింగ్‌కు పది ఎకరాల్లో కంపచెట్లను తొలగించి.. శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ఇనచార్జి బాలాజి, జిల్లా నాయకులు ఎల్‌నారాయణ చౌదరినెట్టం వెంకటేసు, అనీల్‌ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత ప్రదాన కార్యదర్శి నారాయణస్వామి, పార్లమెంటు అధికార ప్రతినిది శశాంక చౌదరి, మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, మాజీ కన్వీనర్‌ వేణుగోపాల్‌, వెంకటనారాయణ, సూరి, రమేష్‌నాయుడు, శ్రీనివాసులు,పూల ఓబుళపతి, బొమ్మయ్య, బాబా, రామదాసు ,అక్కులన్న సందీప్‌, అనీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T23:51:33+05:30 IST