ఘనంగా సప్తమాతృకల విగ్రహ ప్రతిష్ఠ
ABN , First Publish Date - 2023-09-25T23:58:32+05:30 IST
భక్తుల ఆరాధ్య దేవతలు సప్తమాతృకల విగ్రహ ప్రతిష్ఠను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

చిలమత్తూరు, సెప్టెంబరు 25: భక్తుల ఆరాధ్య దేవతలు సప్తమాతృకల విగ్రహ ప్రతిష్ఠను సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రానికి సమీపంలోని పెక్కాల చె రువు వద్ద నిర్మించిన నూతన ఆలయంలో అమ్మవార్ల విగ్రహాలను ప్రతి ష్ఠించారు. గ్రామస్థులు, వేదపండితులు ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆలయంలో సంబం ధిత పూజా కార్యక్రమాలు, హోమాలు చేశారు. వేదపండితుల మంత్రో చ్ఛారణ నడుమ విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా మంగళహారతి అందించారు.
అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటపడాలి: అంబికా
సప్తమాతృకల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రమ కేసులతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని అరె స్టు చేయడం శోచనీయమన్నారు. ఆయన ఈ అక్రమ కేసుల నుంచి బయటపడాలని, ప్రజల దీవెనలు అయనకు ఎల్లవేళలా ఉండేవిధంగా చూడాలని వారు అమ్మవార్లను వేడుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు నందీషప్ప, అశ్వత్థప్ప, విశ్వనాథరెడ్డి, మీసేవ సూరి తదితరులు పాల్గొన్నారు.