Share News

వైసీపీని ఇంటికి సాగనంపుదాం

ABN , Publish Date - Dec 31 , 2023 | 01:13 AM

రాషా్ట్రన్ని సర్వ నాశనం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపుదామని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు.

  వైసీపీని ఇంటికి సాగనంపుదాం

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు

కళ్యాణదుర్గం, డిసెంబరు 30 : రాషా్ట్రన్ని సర్వ నాశనం చేసిన వైసీపీని ఇంటికి సాగనంపుదామని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. శనివారం శెట్టూరు మండలంలోని కరిడిపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించారు.

హామీలను తుంగలో తొక్కిన జగన

ఎన్నికల సందర్భంగా సైకో జగన్‌ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కేశాడని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను నమ్మించి నట్టేట ముంచేసిన ఘనత సైకో జగన్‌ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. హామీల్లో 15 శాతం మాత్రమే నెరవేర్చారే కానీ, మిగిలిన 85 శాతం నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించారని వాపోయారు. వైసీపీ పాలనంతా దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలు, అవినీతి కనిపిస్తున్నాయే కానీ, అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. చివరికి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే వైసీపీ పార్టీని నమ్మలేని పరిస్థితికి వచ్చారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిందో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరు చంద్రబాబుపాలనపై మొగ్గుచూపుతున్నారని వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, కొల్లప్ప, పాలబండ్ల శ్రీరాములు, తలారి సత్తి, లింగా సురేంద్ర, కామక్కపల్లి నాగరాజు, బిక్కి గోవిందరాజులు, విరుపాక్షి, డాబా నాగరాజు, వెంకటేశులు, రాయుడు, బొమ్మయ్య ఇస్మాయిల్‌, తిమ్మరాజు, బొమ్మన్న, మంజునాథ్‌, హనుమంతరాయుడు, లక్ష్మన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:13 AM