మినీ మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం చేద్దాం
ABN , First Publish Date - 2023-11-21T00:05:31+05:30 IST
టీడీపీ మినీ మ్యానిఫెస్టోలోని సూపర్‌సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలపై ప్రజ ల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా అవగాహన కల్పిద్దామని టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల
మడకశిరటౌన, నవంబరు 20: టీడీపీ మినీ మ్యానిఫెస్టోలోని సూపర్‌సిక్స్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలపై ప్రజ ల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా అవగాహన కల్పిద్దామని టీడీపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఆవర ణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ... తెలు గుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్ర మాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న అరాచకాలు, అక్రమాలను వివరించాలన్నారు. భవిష్యత్తు తరాలు, రాష్ట్ర భవిష్యత్తు బాగు కోసం చంద్రబాబు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్య మంత్రి జగన పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో మరో 30 ఏళ్లు వెనక్కు వెళ్లింద న్నారు. భవిషత్తు తెలుగుదేశం పార్టీదేనని, జనసేనతో కలిసి నియోజకవ ర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఇరు పార్టీల నాయకులు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఏవిధంగా సమన్వయం చేసుకొంటూ సాగాలన్న అంశాలను పరస్పరంగా చర్చించుకొన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, మీడియా కోఆర్డినేటర్ రవికుమార్‌తోపాటు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్, శివాజీ, రంగస్వామి, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.