చేనేత పరిశ్రమను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2023-03-26T00:07:30+05:30 IST

చేనేత పరిశ్రమను కాపాడుకునేంతవరకు పోరాటాలు చేస్తామని, ఇందుకు కార్మికులంతా ఐక్యంగా కలిసిరావాలని చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు.

చేనేత పరిశ్రమను కాపాడుకుందాం

ధర్మవరం, మార్చి 25: చేనేత పరిశ్రమను కాపాడుకునేంతవరకు పోరాటాలు చేస్తామని, ఇందుకు కార్మికులంతా ఐక్యంగా కలిసిరావాలని చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌ వీధిలోని జీఆర్‌బీ పంక్షనహాల్‌లో చేనేత కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరమగ్గాలలో చేనేత రిజర్వేషన చట్టాన్ని సక్రమంగా అమలుచేయలేదని, జిల్లా కలెక్టర్‌, హ్యాండ్‌లూమ్‌ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పవర్‌లూమ్‌ యజమానులతో అధికారులు కుమ్మక్కై తనిఖీలను తూతూమంత్రంగా సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చేనేత సమస్యలను పరిష్కరించాలని ఏఫ్రిల్‌ 3వతేదీన 36 గంటల పాటు నిరాహార దీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం తాలూక అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, సీపీఐనియోజకవర్గ కార్యదర్శి మధు, రైతుసంఘం జిల్లా నాయకుడు జేవీరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:07:30+05:30 IST