నియంత పాలనకు చరమగీతం పాడుదాం
ABN , First Publish Date - 2023-12-01T00:07:06+05:30 IST
అమడగూరు, నవంబరు 30: నియంత పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మం త్రి పల్లె రఘునాఽథరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. మండలంతోని నిలువురాతి పల్లి గ్రామంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బా బు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భవిష్యత్తుకు గ్యారెంటీలో మాజీమంత్రి పల్లె పిలుపు
అమడగూరు, నవంబరు 30: నియంత పాలనకు చరమగీతం పాడుదామని మాజీ మం త్రి పల్లె రఘునాఽథరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చా రు. మండలంతోని నిలువురాతి పల్లి గ్రామంలో గురువారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు బా బు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పల్లె పాల్గొని వారితో పాటు ఇంటింటా తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ మినీమేనిఫెస్టో పథకాల గు రించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎన్నో అరాచకాలు, అక్రమాలు జరిగాయన్నారు. అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదని తెలిపారు. ఇతంటి అరాచక పాలనను గ తంలో ఎన్నడూ చూడలేదన్నారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరు గుతుందని తెలిపారు. రాష్ట్రం మళ్లీ ప్రగతిబాట లో పయనిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన నియంత పాలనకు చరమగీతం పాడాలని, టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకు లు టైలర్ రామాంజులు, టైలర్ జయరాం, ఎస్. అంజి, డేగ క్రిష్ణారెడ్డి, రా మాంజులనాయుడు, క మ్మల భాస్కర్, సిద్దు, మా రుతి, మూర్తి, నారాయణ, గాయత్రి, బోనాల మాబూ, రమణారెడ్డి, జనసేన నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.