ఆడుదాం ఆంధ్రాకు రెండోరోజూ స్పందన కరువు
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:24 AM
కొత్తచెరువు, డిసెంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రెండవ రోజూ స్పందన కరువైంది.
కొత్తచెరువు, డిసెంబరు 27: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రెండవ రోజూ స్పందన కరువైంది. కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో కలెక్టర్ అరుణ్‌బాబు క్రికెట్ క్రీడను ప్రారంభించారు. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పా క్రీడాకారులు ఎవరూ రాలేదు. ఇక్కడేగాక జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలలోక్రీడాకారులు లేక కార్యక్రమం వెలవెలబోయింది. చేసేది లేక అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిన అరకొర క్రీడాకారులతోనే క్రీడలను ఆడించి మమ అనిపించారు. ప్రభుత్వం పంపిణీచేసి క్రీడాసామగ్రి నాసిరకంగా ఉందని, ఆటలు ఆడే సమయంలో విరిగిపోతున్నాయని క్రీడాకారులు తెలియజేయడం గమనార్హం. ఇలాంటి తరుణంలో ఈ ఆటలను ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తోందో ఎవరికీ అర్థంకాకుండా పోయింది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వినిపించాయి. కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, డీఎ్‌సడీఓ ఉదయ్‌భాస్కర్, పీఈటీలు,పీడీలు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.