చెత్తమాటలు మాట్లాడినవారికి బుద్ధి చెపుతాం

ABN , First Publish Date - 2023-03-20T00:23:04+05:30 IST

తెలుగుదేశం పార్టీ భిక్షతో పైకి వచ్చిన వల్లభనేని వంశీ, గుడివాడ కొడాల నాని నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడు తున్నారని, ఈ చెత్త మాటలు మాట్లాడే ఇద్దరికి చెప్పుదెబ్బలు తప్పవని టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చ రించారు.

చెత్తమాటలు మాట్లాడినవారికి బుద్ధి చెపుతాం

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట

కదిరి, మార్చి 19: తెలుగుదేశం పార్టీ భిక్షతో పైకి వచ్చిన వల్లభనేని వంశీ, గుడివాడ కొడాల నాని నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడు తున్నారని, ఈ చెత్త మాటలు మాట్లాడే ఇద్దరికి చెప్పుదెబ్బలు తప్పవని టీడీపీ కదిరి నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ హెచ్చ రించారు. నల్లచెరువుమండలంలోని జొగన్నపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన యువగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఆ ఇద్దరూ పరిటాల రవి భిక్షతో టీడీపీలో ఎదిగారని ఇప్పుడు చెత్తమాటలు మాట్లా డుతున్నారని అన్నారు. వీరికి చెప్పు దెబ్బలుతప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్‌, అనంతపురం జిల్లాలో పరిటాల రవి కారణజన్ములన్నారు. వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా రాష్ట్రం ఎటువంటి అభివృద్దిలేకుండా చీకట్లో మగ్గుతోందన్నారు. మూడురోజులుగా టీడీపీలో ఉహించని ఉత్సహం కనిపిస్తోందని, వచ్చేఎన్నికల వరకు ఇదే కొనసాగించాలని కోరారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ... ఈ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతోనే పాలన ప్రారంభమైందన్నారు. కూల్చివేతలు, కక్షసాధింపులే ఈ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అన్నారు.

Updated Date - 2023-03-20T00:23:12+05:30 IST