తోలుబొమ్మల కళకు పూర్వవైభవం తెస్తాం
ABN , First Publish Date - 2023-04-03T00:09:06+05:30 IST
అతిప్రాచీనమైన తోలుబొమ్మ కళకు పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని నారాలోకేశ భ రోసా ఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ హామీ
ధర్మవరంరూరల్, ఏప్రిల్2: అతిప్రాచీనమైన తోలుబొమ్మ కళకు పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని నారాలోకేశ భ రోసా ఇచ్చారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారుడు, టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి దళవాయి కుళ్లాయప్ప ఆదివారం ధర్మవరం పట్టణంలోని సీఎనబీ క్యాంపు సైట్ లో నారాలోకేశను కలిశారు. ఆయనకు శ్రీరాముడి పట్టాభిషేకం తెలిపే తోలు బొమ్మను అందజేశారు. ఈ సందర్భంగా దళవాయి కుళ్లాయప్ప తోలు బొమ్మల కళ పరిస్థితిపై వివరించి వినతిపత్రం అందించారు. దీనిపై నారా లోకేశ స్పందిస్తూ తోలుబొమ్మల కళకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీడీపీ అధికారంలోకి రాగానే పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దళవాయి కుళ్లాయప్ప నారాలోకేశకు ధన్యవాదాలు తెలిపారు.
నిధులన్నీ మళ్లించి సర్పంచలను డమ్మీచేశారు సార్...
ధర్మవరంరూరల్: పంచాయతీల నిధులన్నీ మళ్లించి, గ్రామాల్లో సర్పంచలను డమ్మీలను చేశారు సార్... దీంతో గ్రామాలని అభివృద్ది చేయలేక పోతున్నామంటూ ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లి గ్రామ సర్పంచ ముత్యాలప్పనాయుడు నారాలోకేశకు విన్నవించారు. ధర్మవరంలో కొనసాగిన యువగళం పాదయాత్రలో నారాలోకేశను కలిసి వినతిపత్రం అందించారు. వైసీపీ పాలనలో సర్పంచలు నిధులు లేక తీవ్ర ఇబ్బందు లు పడుతున్నామని తెలిపారు. అదేవిధంగా పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ కార్యకర్తలు కోసం ప్రత్యేకనిధి ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోరారు. నారాలోకేశ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే సర్పంచలకు సముచితస్థానం కల్పిస్తామని, గతంలో అన్ని పార్టీల సర్పంచలకు ఒకేవిధంగా న్యాయం చేసి నిధులు పంపీణీ చేశామని అన్నారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో అతాగే న్యాయం చేసి ఆదుకుంటామని తెలిపారు. కార్యకర్తల కోసం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.