అరాచకపాలనకు చరమగీతం పాడుదాం

ABN , First Publish Date - 2023-05-16T01:11:31+05:30 IST

‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు.

అరాచకపాలనకు చరమగీతం పాడుదాం

సైకో ప్రభుత్వాన్ని సాగనంపుదాం: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి

తపోవనం నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సంఘీభావ పాదయాత్ర

అనంతపురంరూరల్‌, మే 15: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర వందరోజులు మైలురాయి చేరుకున్న సందర్భంగా ప్రభాకర్‌ చౌదరి టీడీపీ శ్రేణులతో కలిసి సంఘీభావ యాత్ర చేపట్టారు. సోమవారం ఉదయం తపోవనం సర్కిల్‌ నుంచి ఎ.నారాయణపురం, ఇందిరమ్మకాలనీ మీదుగా నాగిరెడ్డిపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్రను ముగించారు. ఈసందర్భంగా ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతి దానికి కేసుపెట్టి వేధించి, బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమన్నారు. సైకో ప్రభుత్వాన్ని సాగనంపి సంక్షేమ సైకిల్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు జంబాపురం రమణారెడ్డి, సీనియర్‌ నాయకులు గడ్డం సుబ్రహ్మణ్యం, వీరాంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్‌ సాకే గంపన్న, డిష్‌నాగరాజు, సరిపూటి రమణ, నారాయణస్వామియాదవ్‌, మారుతీకుమార్‌గౌడ్‌, కూచిహరి, రాయల్‌ రఘు, రాజారావు, సుధాకర్‌యాదవ్‌, శివ, ముక్తియార్‌, నబిరసూల్‌, బంగినాగ, దళవాయి వెంకటనారాయణ, వంకదార వెంకటక్రిష్ణ, రాంబాబు, రఫీ, చలం, మనోహర్‌, తెలుగు మహిళలు స్వప్న, విజయశ్రీ, తేజశ్విణి, కృష్ణవేణి, సరళ, జానకి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, వసుంధర, వరాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-16T01:11:31+05:30 IST