అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ ఆదినారాయణ పూజ

ABN , First Publish Date - 2023-07-26T00:11:22+05:30 IST

ధిక శ్రావణమాసాన్ని పురస్కరించుకుని కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం లక్ష్మీఆదినారాయణ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి మూలవిరాఠ్‌కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.

అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ ఆదినారాయణ పూజ
పూజలందుకుంటున్న లక్ష్మీ ఆదినారాయణులు

అనంతపురం కల్చరల్‌, జూలై 25: అధిక శ్రావణమాసాన్ని పురస్కరించుకుని కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం లక్ష్మీఆదినారాయణ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి మూలవిరాఠ్‌కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. వాసవీమాత ఉత్సవమూర్తికి 108 రకాల మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు. లక్ష్మీ ఆదినారాయణులను నేత్రమనోహరంగా అలంకరించి, ఆలయ ఆవరణలోని వేదికపై ఆశీనులను గావించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణ చేస్తుండగా 600 మంది మహిళలు సమూహికంగా కుంకుమార్చన చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కొత్తూరు ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాదేవి, కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T00:11:22+05:30 IST