నారా లోకేశను సత్కరించిన కురుబలు

ABN , First Publish Date - 2023-03-20T00:07:42+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ ను ఆదివారం యువగళం పాదయాత్రలో కురుబ కులస్థులు ఘనంగా స న్మానించారు.

నారా లోకేశను సత్కరించిన కురుబలు

పెనుకొండ, మార్చి 19: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ ను ఆదివారం యువగళం పాదయాత్రలో కురుబ కులస్థులు ఘనంగా స న్మానించారు. ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, భర్త వెంకటేశ్వర్‌రావు, కురుబలు కదిరి నియోజకవర్గం చిన్నపిల్లోళ్లపల్లి నుంచి జోగన్నపే ట వరకు నారాలోకేశతో కలిసి పాదయాత్రలో నడిచారు. ఈసందర్భంగా రా డ్నాలపల్లి వద్ద సవిత, కురుబసంఘం నాయకులు లోకేశతో మాట్లాడారు. ఆయనకు కంబళి కప్పి సత్కరించి, వినతిపత్రాన్ని అందించారు. కురుబలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.

మడకశిరటౌన: నారాలోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆదివారం పలువురు టీడీపీ నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ్‌, నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఆర్‌ జయకుమార్‌, నాయకులు డాక్టర్‌ కృష్ణమూర్తి త దితరులు పాదయాత్రలో నారాలోకేశతో కలసి నడిచారు. పాదయాత్రకు వ స్తున్న స్పందన చూసి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని నాయకులు అన్నారు. యాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నా ప్ర జలు బ్రహ్మరథం పడుతూ ముందుండి నడుపుతున్నారని పేర్కొన్నారు.

హిందూపురం: నారాలోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో హిం దూపురం టీడీపీ నాయకులు ఆదివారం హాజరయ్యారు. పార్లమెంట్‌ ప్రధా న కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T00:07:42+05:30 IST