Share News

ఈవీఎం, వీవీప్యాట్‌లపై అవగాహన

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:44 AM

ధర్మవరం, డిసెంబరు 22: ఈవీఎంల ద్వారా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రజలకు అధికారు లు అవగాహన కల్పించారు.

ఈవీఎం, వీవీప్యాట్‌లపై  అవగాహన

ధర్మవరం, డిసెంబరు 22: ఈవీఎంల ద్వారా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రజలకు అధికారు లు అవగాహన కల్పించారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవా రం ఆర్డీఓ రమేశరెడ్డి, ము న్సిపల్‌ కమిషనర్‌ బండిశేషన్న ముందుగా ఈవీఎం, వీవీప్యాట్‌ను ప్రదర్శనకు ఉంచారు. వాటి ద్వారా ఎంచుకున్న అభ్యర్థికి ఓటు ఎలా వేయాలో ప్రజలకు వివరించారు. ఈవీఎంలో బటన నొక్కితే ఆ ఓటు వీవీప్యాట్‌లో ఏ పార్టీకి పడిందో ఆ పార్టీ సింబల్‌ చూడవచ్చని వివరించారు. ఈవీఎం ద్వారా ఓటు వేస్తే వేరే పార్టీకి పడుతుందన్న అపోహ చాలా మందిలో ఉందని, అది వాస్తవం కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఈవీఎం, వీవీప్యాట్‌ అందుబాటులో ఉంటాయని, ఓటు ఎలా వేయాలో ప్రతి ఓటరు వచ్చి చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏఓ కుఫ్రా, డిప్యూటీ తహసీల్దార్‌ హంపయ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:44 AM